మైనారిటీ సంఘం అధ్యక్షులుగా అబ్దుల్ ఘని
1 min readపల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: మైనారిటీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులుగా జలకనూరు గ్రామానికి చెందిన మైనారిటీ నాయకులు షేక్ అబ్దుల్ ఘని నియామకం అయ్యారు.అదేవిధంగా మైనారిటీ సంఘం నంద్యాల జిల్లా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా షేక్ బషీరుద్దీన్ ను నియమించారు.తర్వాత మిడుతూరు మండలం మైనారిటీ సంఘం అధ్యక్షులుగా మిడుతూరు గ్రామానికి చెందిన మాసుం వలిని నియమించారు. నందికొట్కూరు నంద్యాల ప్రధాన రహదారిలో ఉన్న గోడౌన్ దగ్గర జరిగిన మైనార్టీ సమావేశంలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రాష్ట్ర మైనారిటీ సంఘం ప్రధాన కార్యదర్శి మీర్సా బాబు,సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎండి రఫీ అహ్మద్,సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ కే.ఖాదర్ బాషా వీరి ఆధ్వర్యంలో మైనార్టీ సంఘం అధ్యక్షులుగా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మైనారిటీ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన వారందరిని పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జలకనూరు ఎంపిటిసి హరి సర్వోత్తమ్ రెడ్డి,పుల్లయ్య మరియు వివిధ గ్రామాల మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.