అబ్దుల్ కలాం జీవితం ప్రజలకు ఆదర్శం
1 min readపల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: భారత పదకొండవ మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం 91వ జయంతిని చెన్నూరు మండలం మారుమూల చిన్న గ్రామమైన కో క్క రాయి పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు రమణయ్య. వీర నారాయణ లు మాట్లాడుతూ అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు మరచిపోలేము అన్నారు. ఒక గొప్ప శాస్త్రవేత్త గా ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న వ్యక్తి అబ్దుల్ కలం అని కొనియాడారు. అంతరిక్ష పరిశోధనలో భారతదేశానికి ఎన్నో విజయాలను సాధించి పెట్టారని అన్నారు. విద్యార్థుల పట్ల మంచి గౌరవం ఉండేదని వారు తెలియజేశారు . ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.