PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలంలో.. గర్భాలయ అభిషేకం, స్వామి స్పర్శదర్శనం నిలుపుదల

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసోత్సవాలు డిసెంబర 5న ముగియనున్నాయి. ఈ మాసోత్సవంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ ఈఓ లవన్న తెలిపారు.ముఖ్యంగా కోవిడ్ నివారణ ముందుజాగ్రత్తలు, భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, క్యూలైన్లలో భక్తులకు అల్పాహారం అందజేయుట, అన్నప్రసాదాల వితరణ, శ్రీస్వామి అమ్మవార్ల ఆర్జితసేవలు, పారిశుద్ధ్యం, పార్కింగ్, పర్వదినాలలో ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీకపౌర్ణమి రోజన జ్వాలాతోరణం మరియు పాతాళగంగ వద్ద నదీహారతి మొదలైన వాటికి ఆయా ఏర్పాట్లు చేయబడుతున్నాయి.
గర్భాలయ అభిషేకాలు మరియు స్పర్శదర్శనం నిలిపివేత:
కార్తికమాసములో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. స్వామివారి గర్భాలయ అభిషేకం, స్పర్శదర్శనం నిలిపివేసినట్లు ఆలయ అధికారులు ఆదివారం ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థమై సామూహిక అభిషేకాలు నాలుగు విడతలుగా జరిపించబడుతాయి. మొదటి విడత సామూహిక అభిషేకాలు ఉదయం గం. 6.30 లకు: రెండవ విడత ఉదయం గం. 6.30లకు మూడవ విడ ఉదయం గం. 12.30లకు నాలగవ విడత సామూహిక అభిషేకాలు సాయంత్రం గం.8. 30 నుంచి సాముహిక అభిషేక సేవకర్తలకు కూడా గత సంవత్సరము వలనే స్పర్శ దర్శనానికి అవకాశం ఉండదు. వీరికి కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుంది. అదేవిధంగా కార్తికమాసములో పరిమితంగా కల్పించబడే విరామ దర్శనం (బ్రేక్ దర్శనం) భక్తులకు కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుంది.
కాగా వేకువజామున గం.3.30లకు ఆలయద్వారాలు తెరచి ఉదయం గం. 5.00ని.ల నుంచి మధ్యాహ్నం గం.3.30ల వరకు, తిరిగి సాయంత్రం గం.5.30 నుండి రాత్రి గం.10,00ల వరకు దర్శనాలకు అనుమతించినట్లు ఆలయ ఈఓ లవన్న వెల్లడించారు.

About Author