60 సెకండ్లలోనే వెబ్‌సైట్ రూపొందించే అవకాశం
1 min read– ఎస్ఎంఈలకు కల్పిస్తున్న సైట్స్ 60 సంస్థ
– హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలు (ఎస్ఎంఈలు) డిజిటల్ మార్గంలోకి ప్రవేశించడానికి ఇన్నాళ్లూ అనేక అడ్డంకులు ఉన్నాయి. వారు సొంతంగా వెబ్‌సైట్ రూపొందించుకోవాలంటే చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని తొలగించేందుకు వీలుగా.. కేవలం 60 సెకండ్లలోనే, అంటే ఒక్క నిమిషంలోనే ఎస్ఎంఈలు తమ సొంత వెబ్‌సైట్‌ను రూపొందించుకునే అవకాశాన్ని సైట్స్ 60 సంస్థ కల్పిస్తోంది. ఈ సంస్థను తెలంగాణ ఐటీ, వాణిజ్యం, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీహబ్ సీఓఓ అనీష్ ఆంథోనీ, సైట్స్ 60 వ్యవస్థాపకుడు రాజీవ్ రావులపాటి తదితరులు పాల్గొన్నారు. చాట్ జీపీటీ సామర్థ్యాలను కూడా సొంతం చేసుకున్న ఈ సృజనాత్మక సంస్థ.. చిన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకునేందుకు కావల్సిన డిజిటల్ పరిష్కారాలను సులభమైన పద్ధతిలో అందిస్తుంది. ఏ రకం వ్యాపారాలు నిర్వహిస్తుంటే వారికి అనుగుణంగా ఆ తరహా సమాచారాన్ని అందించేలా వెబ్‌సైట్‌ను కస్టమైజ్ చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. ఉపాధ్యాయులు, రీటైలర్లు, జిమ్ కోచ్‌లు.. ఇలా ఎవరికైనా వారికి కావల్సిన సమాచారంతో కూడిన వెబ్‌సైట్‌ను కేవలం 60 సెకండ్లలోనే ఈ ప్లాట్‌ఫాం ద్వారా రూపొందించవచ్చు. చిన్న వ్యాపారవేత్తలకు అనేక సమస్యలుంటాయి. ఏ సమాచారం ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఒకవేళ తెలిసినా, దాన్నంతటినీ తమ సొంత వెబ్‌సైట్ రూపంలోకి మార్చుకోవడం అంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఇలాంటి వారందరి అవసరాల కోసం సైట్స్ 60.కామ్ ఏర్పడింది. ఏడాదికి కేవలం 60 డాలర్లు (సుమారు రూ.5వేలు) చెల్లించి, కంపెనీ వివరాలు, లోగో లాంటివి అందిస్తే మంచి ప్రభావశీలమైన వెబ్‌సైట్‌ను కేవలం 60 సెకండ్లలో రూపొందించి ఇస్తారు.
సైట్స్ 60 గురించి…‘‘వివిధ వ్యాపారాలకు సైట్స్ 60 నిరంతర వెబ్ సైట్ మద్దతును అందిస్తుంది. పెద్ద వ్యాపారాల కోసం వారి సీఆర్ఎం వరకు లింక్ చేయడంలో సహాయపడుతుంది. వ్యాపారాల డిజిటలైజేషన్ కు ఇది తొలి అడుగు అని దీని వ్యవస్థాపకులైన యాప్‌స్పేస్ ఇన్నోవేషన్స్ ప్రతినిధులు తెలిపారు. స్థానిక భాషల్లో కూడా ఈ సైట్లలో కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఫ్రాన్స్ లో దీనిని ఫ్రెంచ్, స్పానిష్ భాషలలో సృష్టించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగులోనూ వెబ్‌సైట్లు అందిస్తారు. sites60.com/(కంపెనీ పేరు) అనే పద్ధతిలో వెబ్‌సైట్లు ఉంటాయి. ఇప్పటికే ఒకవేళ సొంత డొమైన్ నేమ్ ఉంటే.. ఆ కంపెనీలు సైట్స్60 సేవలను వినియోగించుకోవచ్చు’’ అని సంస్థ వ్యవస్థాపకుడు రాజీవ్ రావులపాటి తెలిపారు. మా లక్ష్యం2025 చివరినాటికల్లా ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది చిన్న, మధ్యతరహా వ్యాపారులకు సేవలు అందించలన్నది మా ప్రధాన లక్ష్యం. వారందరికీ ఆన్‌లైన్ ప్రయోజనాలు అందాలి. దానివల్ల వాళ్లు ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి వీలు కుదురుతుంది. స్థానిక వ్యాపారాలలో కూడా ఇంటర్‌నెట్‌ను ఉపయోగించడం ద్వారా కలిగే ప్రయోజనాలు అపారం. వెబ్‌సైట్ డిజైన్, దాని విశ్వసనీయతను చూసే వినియోగదారులు ఆకర్షితులవుతారు. తక్కువ ఖర్చులో, యూజర్లకు అనుకూలంగా ఉండేలాంటి వెబ్‌సైట్లను సైట్స్60 అందిస్తుంది. దీనిద్వారా వినియోగదారులను ఆకర్షించి, ఈ పోటీ ప్రపంచంలో ఎస్ఎంఈలు మరింత ముందుకు దూసుకెళ్లచ్చు.