PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అబార్ష‌న్ కు భ‌ర్త అనుమ‌తి అవ‌స‌రం లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: వివాహిత మహిళ అబార్షన్ విషయంలో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య గర్భాన్ని తొలగించుకోవాలనుకుంటే అందుకు భర్త అనుమతి అవసరంలేదని పేర్కొంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అబార్షన్ కు అనుమతి ఇవ్వాలంటూ కొట్టాయంకు చెందిన ఓ యువతి (21) కేరళ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది. ఆమె పెద్దలకు ఇష్టంలేని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత భర్త, అత్త నిజస్వరూపం ప్రదర్శించారు. ఆమె గర్భవతి కాగా, ఆమె ప్రవర్తనపై అతడు అనుమానాలు వ్యక్తం చేసేవాడు. అత్త కూడా వేధించసాగింది. దాంతో ఆమె పుట్టింటికి చేరింది. అయితే కడుపులో పెరుగుతున్న పిండాన్ని తొలగించేందుకు ఓ క్లినిక్ కు వెళ్లగా, భర్తతో విడిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ, అబార్షన్ కు తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె పరిస్థితిని లోతుగా పరిశీలించిన కేరళ హైకోర్టు కొట్టాయం మెడికల్ కాలేజి, లేదా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో గానీ అబార్షన్ చేయించుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

                                      

About Author