ఏబీపీ-సీవోటర్ సర్వే..5 రాష్ట్రాల్లో గెలుపు ఈ పార్టీదే !
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశంలో ఐదు రాష్ట్రాలలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏబీపీ-సీవోటర్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరాఖండ్, యూపీ, గోవా, మణిపూర్ రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకోనుందని ఈ సర్వేలో తేలింది. పంజాబ్ లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని సర్వేలో తేలింది. కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగలనుందని సర్వేలో వెల్లడైంది. యూపీలో బీజేపీకి కాస్త బలం తగ్గినా అధికారం చేజిక్కించుకోనుంది. 259 నుంచి 267 సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. ఎస్పీ 109 నుంచి 117 సీట్లు, బీఎస్పీ 12 నుంచి 16 సీట్లు గెలుచుకోనుందని సర్వేలో తేలింది. గోవాలో కూడ బీజేపీ అధికారం చేజిక్కించుకోనుంది. 39 శాతం ఓట్లు దక్కించుకోనుంది. ఆప్ 22 శాతం ఓట్లు, కాంగ్రెస్ 15 శాతం ఓట్లుకు పరిమితం కానుంది. మణిపూర్ లో కూడ బీజేపీ అధికారం చేజిక్కించుకోనుంది. సర్వే ప్రకారం కాంగ్రెస్ రెండో స్థానానికే పరిమితం కానుంది.