అవినీతి పై ఫిర్యాదుకు ఏసీబీ యాప్
1 min readపల్లెవెలుగువెబ్ : అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ప్రారంభించారు. గతంలో సీఎం ఆదేశాలమేరకు ఏసీబీ ఈ యాప్ తయారు చేసింది. స్పందనపై నిర్వహించిన సమీక్షలో సీఎం.. యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఒకటే మాట చెబుతున్నామని.. ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాట చాలా స్పష్టంగా చెప్పామన్నారు. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.