బనగానపల్లె మైనింగ్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
1 min read– రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన సూపరింటెండెంట్, అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్
– రూ.60వేలు సీజ్ – వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి
పల్లెవెలుగువెబ్, బనగానపల్లె: కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గ కేంద్రంలోని మైనింగ్ కార్యాలయంపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడిలో కార్యాలయ సూపరింటెండెంట్ పనిచేస్తున్న షేక్ మీర్ హుస్సేన్, అటెండర్ శంకర్, కంప్యూటర్ ఆపరేటర్ ధనుంజయుడు రూ.60వేలు లంఛం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. బెలుం గ్రామానికి చెందిన జయరాముడు ఒక ఎకరా మైనింగ్ భూమిని లీజు పొందడం కోసం దరఖాస్తు చేసుకోగా పట్టణ మైనింగ్ కార్యాలయ సూపరింటెండెంట్ షేక్ మీర్ హుస్సేన్, భూ యజమాని జయరాముడు ను 60 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ డి.ఎస్.పి శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి నిర్వహించారు. బాధితుడు జయరాముడు నుంచి రూ. 60 వేలు నగదు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.