PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ సీఎంఆర్​ఎఫ్​ అవినీతిలో ఏసీబీ విచారణ – 4గురి అరెస్టు!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్​ఎఫ్​) నిర్వహణ విభాగంలో జరుగుతోన్న అవినీతిపై ఏసీబీ విచారణ చేపట్టింది. ఈమేరకు బుధవారం నలుగురు వ్యక్తులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సచివాలయ ఉద్యోగులు ఇద్దరు, మరో ఇద్దరు ప్రయివేటు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. పేద ప్రజల ప్రయోజనార్థం సీఎం రీలీఫ్​ ఫండ్​ పథకాన్ని ఏపీ సర్కార్​ 2014నుంచి అమలు చేస్తోంది. అయితే గతకొంతకాలంగా సీఎంఆర్​ఎఫ్​ నిధులు దుర్వనియోగం అవుతున్నాయన్న కోణంలో ఏసీబీ కొద్దిరోజులుగా అంతర్గత విచారణ చేపడుతోంది. ఈక్రమంలో ఏపీ సచివాలయ కార్యాలయంలో నలుగురు వ్యక్తులు సదరు పథకం అమలులో అవినీతికి పాల్పడినట్లుగా ఏసీబీ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈమేరకు మున్ముందు సీఎంఆర్​ఎఫ్​ నిధుల గోల్​మాల్​ ఏమేర ఉంటుందన్నది తేలాల్సి ఉంది.

About Author