PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గడివేముల తహసీల్దార్​ కార్యాలయంపై ఏసీబీ దాడులు

1 min read

రూ.43వేలు స్వాధీనం — వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి

పల్లెవెలుగు వెబ్​, గడివేముల: కర్నూలు జిల్లా గడివేముల తహసీల్దార్​ కార్యాలయంపై ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.  రెవెన్యూ సిబ్బంది పట్టాదారు పాస్​ పుస్తకాలకు, తదితర పనులకు లంఛం డిమాండ్​ చేస్తున్నారని మండల ప్రజల నుంచి ఆరు ఫిర్యాదులు అందడంతో రికార్డులు తనిఖీ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి వెల్లడించారు. తనిఖీలో భాగంగా రూ.43వేలు అనధికారిక సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. డెలివరీ చేయని 20 పాస్ బుక్కులు ఉన్నట్లు గుర్తించామన్నారు. రికార్డులు స్వాధీనం చేసుకొని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు.  దాడుల్లో సిఐలు కృష్ణారెడ్డి , కృష్ణయ్య, వంశీ నాథ్ ,ఇంతియాజ్ బాషా పాల్గొన్నారు.

About Author