ఉదయం వరకూ సాగిన ఏసీబీ సోదాలు
1 min read– విఆర్ఓను రిమాండ్ కు పంపిన ఏసీబీ అధికారులు -అవినీతిపై గతంలోనే పల్లెవెలుగు కథనం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: అవినీతి విఆర్ఓ వెంకట రమణారెడ్డిని కోర్టులో హాజరు పరచగా ఆయనను కోర్టు రిమాండ్ కు పంపినట్లు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)డిస్పీ వెంకటాద్రి తెలిపారు.మండల పరిధిలోని జలకనూరు గ్రామానికి చెందిన రైతు మాజీ డీలర్ వెంకట రమణయ్య వద్ద నుంచి జలకనూరు,సుంకేసుల గ్రామాల వీఆర్వో తమిదెల వెంకట రమణారెడ్డి బుధవారం సా.6 గంటలకు 7 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి తెలిసిందే..బుధవారం సా.6 గంటల నుంచి గురువారం ఉ.5 గంటల వరకు విఆర్ఓ ప్రైవేటు గది మరియు తహసిల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు అదే విధంగా గ్రామాలకు చెందిన రైతులు పత్రాలను పరిశీలించినట్లు విఆర్ఓకు సంబంధించిన నివేదికను కోర్టుకు అందజేసినట్లు డీఎస్పీ పల్లె వెలుగు పాత్రికేయుడుతో ఫోన్ ద్వారా తెలిపారు. మండలంలోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.అధికారులు వేలు లక్షల కొద్ది జీతాలు తీసుకుంటూ ఉన్నా ఇంకా వారి డబ్బు ఆశ తీరటం లేదని ప్రజల నుంచి పైశాచికంలా పట్టి పీడిస్తూ డబ్బులు ఇస్తేనే మీ పనులు చేస్తామంటూ బెదిరించడం పైసలు ఇవ్వకుంటే ఏదో కుంటి సాకులతో నిలిపివేయడం మండలంలోని ఏ శాఖలో చూసుకున్నా అధికారులకు ఓ పరిపాటిగా మారిపోయిందని ఇలాంటి అధికారులను ఏమి చేయాలి..అని ఏసీబీ అధికారులే వీరికి గురి అని ప్రజలు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈమధ్యనే అవినీతి అధికారులపై ఏసీబీ దృష్టి సారించిందని పల్లెవెలుగు కథనంలో ప్రచురించింది.అవినీతి అధికారులు లంచాల కోసం రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం రైతులు తిరిగి తిరిగి విసించి ఆత్మహత్యలకు కూడా కారణం అవుతున్నాయని మండల ప్రజలు అంటున్నారు.ఇక నుంచి అయినా మండలంలో ఉన్న అధికారులు అవినీతికి దూరంగా ఉంటారా లేదా అన్నది వేచి చూడాలి..ఏ అధికారి అయినా ఒక్క పైసా తీసుకోకుండా ప్రజలకు ఉచితంగా పనులు చేయాలని ప్రజలను ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 14400 టోల్ ఫ్రీ నెంబరుకు గాని లేకపోతే కర్నూలులో మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చని ఫిర్యాదు దారుడి వివరాలు రహస్యంగా ఉంచుతామని సదరు లంచగొండి అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటూ వారి భరతం పడతామని కర్నూలు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ వెంకటాద్రి ప్రజలను కోరారు.ఈ సోదాల్లో డీఎస్పీ తో పాటు ఏసీబీ సీఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.