‘నాడు–నేడు’ పనులు వేగవంతం చేయండి
1 min read– జిల్లా అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ కె. వేణుగోపాల్
పల్లెవెలుగు వెబ్, బనగానపల్లె: జిల్లాలోని నాడు-నేడు కింద మంజూరైన పనులను వేగవంతం చేయాలని జిల్లా ఏపీసి (అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్) కె.వేణుగోపాల్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కేజీబీవీ పాఠశాల ఆవరణాన్ని పరిశీలించి కేజీబీవీ వెనక ఉన్న ప్రాంతాన్ని మరింత విశాలంగా శుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి స్వరూప తో పాటు ప్రధానోపాధ్యాయులు, సిఆర్పిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఏపీసీ (అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్) కె.వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాలోని 1037 పాఠశాలలో నాడు నేడు కింద పనులు జరుగుతున్నాయని, ఇందులో 4173 సివిల్ వర్క్ పనులకు గాను 3547 పూర్తయ్యాయని , మిగతా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా బనగానపల్లె మండల పరిధిలోని 26 పాఠశాలలో జరుగుతున్న పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు .కార్యక్రమంలో ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రామలక్ష్మమ్మ, ప్రధానోపాధ్యాయులు బాల మద్దిలేటి, పద్మావతి, దస్తగిరి, సుంకన్న ,సుధాకర్ , మద్దయ్య, సత్య ప్రకాష్, సి ఆర్ పి లు ,పి. , సుధాకర్ రావు, ప్రసాద్ యాదవ్, హుస్సేన్ వలీ, శివరామ మద్దిలేటి (మధు),సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.