ప్రభుత్వ ప్రాజెక్టులకు..భూ సేకరణను వేగవంతం చేయండి
1 min read– అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆదేశించారు. బుధవారం సాయంత్రం ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణపై ఆర్డీవోలు, సబ్ కలెక్టర్, ఏపీఐఐసీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, డిఆర్ ఓ పుల్లయ్య, కర్నూలు, ఆదోని ఆర్ డిఓలు హరి ప్రసాద్, రామకృష్ణారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ…. జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రాజెక్టులు మరియు ఏపీఐఐసీకి భూసేకరణ పెండింగ్ లేకుండా భూ సేకరణ వేగవంతం చేయాలని నంద్యాల సబ్ కలెక్టర్, కర్నూలు, ఆదోని ఆర్డీవోలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భూసేకరణలో అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేసి భూసేకరణ చేయకుండా ఉంటే వెంటనే భూ సేకరణ చేయాలన్నారు. రైల్వే సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని, కర్నూలు, ఆదోని, నంద్యాల డివిజన్లో రైల్వే సంబంధించి భూసేకరణ ఈ నెల 16 లోగా ప్రభుత్వ భూములను భూసేకరణ చేసి అప్పజెప్పాలని నంద్యాల సబ్ కలెక్టర్, కర్నూలు, ఆదోని ఆర్ డిఓలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భూసేకరణ వేగవంతం కోసం సంబంధిత మండలాల తహశీల్దార్ లతో తరచూ సమీక్షలు నిర్వహించాలని ఆర్ డిఓలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చెన్నై – సూరత్ నేషనల్ హైవే భూసేకరణకు సంబంధించి నవంబర్ లోగా పూర్తి చేయాలని కర్నూలు ఆర్ డిఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఏపీఐఐసీ, సోలార్ ప్రాజెక్టు, ఆర్ అండ్ బి, ఈఈ పబ్లిక్, ఎమ్ఐ ఇరిగేషన్, కేసీ కెనాల్, రైల్వే తదితర శాఖలకు సంబంధించి భూసేకరణ సంబంధిత అధికారులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.