PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోని మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేయండి

1 min read

    : APMSIDC ఎండీ మురళీధర్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఆదోని మెడికల్ కళాశాల పనులను వేగవంతం చేయాలని సంబంధిత ఏజెన్సీలను APMSIDC ఎండీ మురళీధర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జాయింట్ కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డిలతో కలిసి APMSIDC ఎండీ మురళీధర్ రెడ్డి ఆదోని మెడికల్ కళాశాల నిర్మాణం పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని మెడికల్ కళాశాల నిర్మాణానికి సంబంధించి నిధుల కొరత లేదని పనులను వేగవంతం చేయాలని సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. కళాశాల నిర్మాణానికి కావాల్సిన నీటి కోసం తాత్కాలికంగా ఆరేకాల్ సంప్ నుండి ఒక కిలోమీటర్ పైప్ లైన్ ఏర్పాటు చేయాలని ఆర్ డబ్లు ఎస్ అధికారులను ఆదేశించారు. వారం లోపు ఈ పైప్ లైన్ పూర్తి కావాలని ఇందుకోసం ఆదోని సబ్ కలెక్టర్ సహకారం తీసుకోవాలని సూచించారు. శాశ్వతంగా నీటిని సరఫరా చేసేందుకు అనువైన అవకాశాలతో తగిన ప్రతిపాదనలను పంపాలని  ఆర్ డబ్లుఎస్, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ అంశంలో ఆర్ డబ్లు ఎస్, ఇరిగేషన్ ఎస్ ఈ లు సమన్వయం చేసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో APMSIDC ఎస్ ఈ రమేష్ రెడ్డి, ఈ ఈ రాజ్ గోపాల్ రెడ్డి, ఆర్ డబ్లు ఎస్ ఈ నాగేశ్వర రావు, ఇరిగేషన్ ఎస్ ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author