PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం మే నెల 9వ తేదీ నుండి 25వ తేదీవరకు మోడల్ స్కూల్ ఆరవ తరగతి ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని బనగానపల్లి ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి రామలక్ష్మి తెలిపారు. ఐదవ తరగతి పూర్తి చేసి 2023- 24 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఆధారంగా రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రవేశాలను కల్పించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని బనగానపల్లి మండల పరిధిలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఓసి, బీసీ విద్యార్థులకు 150 రూపాయలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 75 రూపాయలు ఆన్లైన్లో చెల్లించి అప్లై చేసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా జూన్ 11న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఓ సి, బి సి విద్యార్థులు 01-09-2011 నుండి 31-08-2013 సంవత్సరాల మధ్యలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01-09-2009నుండి 31-08-2013 సంవత్సరాల మధ్యలో జన్మించి ఉండాలని తెలియజేయడం జరిగింది.

About Author