ప్రైవేట్ బస్సుకు యాక్సిడెంట్.. ?
1 min read– 10 మందికి గాయలు
పల్లెవెలుగు వెబ్: హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కోదాడ జాతీయ రహదారి మీద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం. వీరిలో 10 మందికి గాయలైనట్టు సమాచారం. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.