11 పథకాలు సాధించడం అభినందనీయం : మాజీ ఎంపీ టీజీ వెంకటేష్
1 min read– జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారులను అభినందించిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలోని హోటల్ మౌర్యాఇన్ కాంప్లెక్స్ లోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల కలకత్తాలో జరిగిన జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లాకు చెందిన వెటరన్ క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కోశాధికారి మద్దిలేటి రెడ్డి, నరసయ్య, రామచంద్రారెడ్డి ,ఆదోని సెక్రెటరీ బద్రీనాథ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలకత్తాలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లాకు చెందిన క్రీడాకారులు సీమ ఎలిగే ,కాజా బందే నవాజ్, చెన్నకేశవరెడ్డి, పాండురంగారెడ్డి, శంకర్ రెడ్డి తదితరులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు .ఈ సందర్భంగా వారిని శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన జాతీయస్థాయి మాస్టర్ పోటీల్లో జిల్లాకు చెందిన 30 మంది క్రీడాకారులు పాల్గొని 11 పథకాలు సాధించడం అభినందనీయమని తెలిపారు. అలాగే ఇందులో నలుగురు అక్టోబర్ మాసంలో ఫిలిఫైన్స్ లో జరగనున్న ఏషియన్ మీట్ కు ఎంపిక కావడం అభినందనీయమని తెలిపారు. ఇందులో 55 నుండి 85 సంవత్సరాల వరకు ఉన్న క్రీడాకారులు ఉన్నారని, కేవలం క్రీడల్లో పాల్గొనడం వల్లే వారు ఇంత ఆరోగ్యంగా ఉన్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పారు.కర్నూల్ లో క్రీడల అభివృద్ధికి తమ వంతు సహకారం నిరంతరం అందిస్తామని వివరించారు .అయితే క్రీడలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కూడా అవసరమైన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు .ప్రతి గ్రామంలో స్టేడియంలను ఏర్పాటు చేయడం వల్ల గ్రామస్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించవచ్చు అని తెలిపారు. ఫలితంగా ఒలంపిక్స్ లో భారత దేశం తరఫున మరిన్ని పథకాలు సాధించే అవకాశం ఉందని వివరించారు. కర్నూలు జిల్లాలో క్రీడాకారులతో పాటు కళాకారులకు మంచి గుర్తింపు ఉందని వివరించారు. మాస్టర్ క్రీడాకారులకు తమ వంతు సహకారం నిరంతరం అందిస్తామని ఆయన తెలిపారు.అనంతరం జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండురంగారెడ్డి తదితరులు మాట్లాడుతూ కర్నూల్ నగరంలో క్రీడలో అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. ముఖ్యంగా తమ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్కు ఆయన అందిస్తున్న సహకారం వల్లే తాము జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనగలుగుతున్నామని వివరించారు. కలకత్తా లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచామని ఇందులో నలుగురు అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారని వివరించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారం తమకు నిరంతరం ఉంటుందని చెప్పారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశులు వారు శాలువాకప్పి సన్మానించారు.