ప్రజల ఆకాంక్ష మేరకే.. జిల్లాకేంద్రంగా ఏర్పాటు..
1 min read– ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగువెబ్, రాయచోటి : భౌగోళికంగా అందరికి అనుకూలంతో పాటు తగిన వసతులు ఉన్నాయన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంగా రాయచోటి ఎంపికకు కృషిచేసిన ప్రభుత్వచీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిని బుధవారం మున్సిపల్ సభాభవనంలో రెడిమేడ్ బట్టల షాపు ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు గజమాలతో సత్కరించి, కలియుగ వైకుంఠం వెంకటేశ్వరుడిని జ్ఞాపికను అందచేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు కోసం ఉద్దేశించి ప్రణాళికాసంఘం సభ్యులు అందచేసిన నివేదిక ప్రకారమే ప్రభుత్వం రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాకేంద్రం ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూములుతో పాటు అన్నిరకాల వసతులు రాయచోటి ప్రాంతంలో ఉన్నాయన్నారు. మదనపల్లె ప్రాంతం ఇప్పటికే బెంగళూరు పట్టణానికి దగ్గరగా ఉండడంతో పాటు పర్యాటకాభివృద్ధి చెంది ఉందన్నారు. ఇక రాజంపేట, కోడూరు ప్రాంతాలు పండ్లకోటలు,బనిజసంపదతో కళకళలాడుతూ పలురకాల పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉందంటూ చెప్పారు. రాయచోటిలో ఎలాంటి పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు లేవన్నారు. ఈ విషయాలను గుర్తెరిగిన ప్రణాళికా సంఘం వారు ఇచ్చిన నివేదికతో పాటు అందరి ఆశీస్సుల మేరకు రాయచోటి జిల్లాకేంద్రంగా ఎంపికైందన్నారు. 2022 ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించు కుందా మంటూ ఆయన పిలుపునిచ్చారు.