PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేరుగుతున్న రాజకీయ వేడి..

1 min read

వాట్సాప్ లో సోషల్ మీడియాలో యుద్ధం..

పల్లెవెలుగు వెబ్ గడివేముల: , పాణ్యం నియోజకవర్గంలో టిడిపి వైసిపి పోస్టులతో వాట్సాప్ లో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో రోజు యుద్ధమే జరుగుతుంది గత వారం రోజులుగా ఖరారు కానీ ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి వారు తమ నేతకు ఖరారు అయిందని టిడిపిలో ప్రస్తుత సిట్టింగ్ అభ్యర్థి గౌరు చరితకు  టికెట్ లేనట్టేనని. వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని కి ఈసారి టికెట్ ఇవ్వరని తమ గ్రూపుల్లో ప్రత్యర్థి అభ్యర్థులపై ప్రచారం హల్చల్ చేసుకోవడం మర్చిపోకముందే ప్రస్తుత ఎమ్మెల్యే మీద ప్రముఖ పత్రికలో కథనం ప్రచురితమైంది నియోజకవర్గ వ్యాప్తంగా 2019 నుండి అనుచరులు కోట్లు కొల్లగొట్టారని బెదిరింపులకు దిగారని వార్త రాగ.. తాజాగా మంగళవారం నాడు ఓర్వకల్ మండలం పూడిచెర్ల గ్రామానికి చెందిన ప్రముఖ వైసిపి నాయకుడు రాజన్న ఐప్యాక్ సభ్యునితో మాట్లాడుతూ వైసిపి నాయకులపై జగన్ పాలనపై చురకలు అంటించడం నియోజకవర్గ వ్యాప్తంగా ఆడియో సంభాషణ హల్ చల్ అయింది రానున్న రోజుల్లో వైసిపి టిడిపి మధ్య మరింత వేడి రాజుకునే అవకాశం ఉంది.. మొత్తానికి వ్యతిరేక పోస్టులతో ఓటర్లు ఎంతవరకు ప్రభావితం అవుతారో  వేచి చూడాలి .

About Author