ముద్దాయిలు అరెస్టు – ఎమ్మిగనూరు రూరల్ సిఐ
1 min read– వారీ వద్ద నుండి సుమారు 18 లక్షల 25 వేల వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల లో స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎమ్మిగనూరు రూరల్ సిఐ మంజునాథ్, ఎస్సై తిమ్మారెడ్డి లు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మిగనూరు రూరల్ సీఐ మంజునాథ్ మాట్లాడుతూ ఈనెల 13వ తారీఖున వ్యవసాయ మోటర్లు దొంగిలించబడినట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో ఎస్సై తిమ్మారెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి మంగళవారం గోనెగండ్ల సమీపంలోని గ్యాస్ గోడౌన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని విచారణ చేయగా వారి వద్ద నుండి ఒక ట్రాక్టర్ ,ఒక ట్రైలర్ ,ఒక రోటవేటర్, మూడు అగ్రికల్చర్ మోటర్లు , ఏడుమడకల నాగలి సేట్టు అను వారి నుండి స్వాధీనం చేసుకున్నామన్నారు. ముద్దాయిలు ఐరన్ బండ గ్రామానికి చెందిన పిక్కిలి మునిస్వామి ఓరఫ్ ముని రంగడు, మల్కాపురం గ్రామానికి చెందిన బోయ మల్లికార్జున, కడిమెట్ల గ్రామానికి చెందిన బోయ అడవి కుమార్, ఐరన్ బండ గ్రామానికి చెందిన బోయ బజారి, కడిమెట్ల గ్రామానికి చెందిన తెలుగు రాజు, వంటేడుదిన్నె గ్రామానికి చెందిన బోయమిన్నల్లా లను అరెస్ట్ చేసి వద్ద నుండి ఇప్పటివరకు వారు దొంగలించిన వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక ట్రాక్టర్ బైకు మిస్సింగ్ కేసు నమోదు కావడంతో వాటిని సీజ్ చేశామన్నారు. మంగళవారం ముద్దాయిల నుండి స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ మొత్తం సుమారు 18 లక్షల ఇరవై ఐదువేలుగా గుర్తించామన్నారు. అలాగే ఎస్సై తిమ్మారెడ్డిని మరియు పోలీస్ సిబ్బంది ని ఎమ్మిగనూరు రూరల్ సిఐ మంజునాథ్ అభినందించారు.