ముచ్చుమర్రి నాటు బాంబుల కేసులో ముద్దాయిలు అరెస్ట్
1 min read– పరారీలో ఉన్న ఇద్దరి ముద్దాయిలను త్వరలో అరెస్ట్ చేస్తాం
– కేసులో ఎంతటి వారు ఉన్న ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు
– నందికొట్కూరు రూరల్ సీఐ విజయభాస్కర్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో సిఐ విజయభాస్కర్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఎస్ పి రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పీ సూచనలతో పగిడ్యాల మండలము, కొత్త ముచ్చుమర్రి గ్రామం లో నాటు బాంబుల కేసును ఛేదించామన్నారు. జులై నెలలో 24 న ఆశన్నగారి మధు ( అల్లరి మధు) మరియు మద్దిలేటి నే వ్యక్తులు ఇద్దరిపై ముద్దాయిలు పాత మనస్పర్థలు ఉన్నాయి. అల్లరి మధు కు పెద్ద రంగడు పెద్ద రంగస్వామి, చిన్న రంగస్వామికి మధ్య గోడ, చెట్టు కొట్టిన విషయంలో మనస్పర్థలు ఉన్నాయి. అల్లరి మధును మధ్యం కేసులో ఇరికించాలని ఒక పిటిషన్ ను తయారు చేసి ఉన్నత అధికారులకు కూడా పిర్యాదు చేశారని, ఫిర్యాదు దారుడుకు ఉన్న పాత మనస్పార్తల కారణంగా అందరూ గ్రూప్ గా ఏర్పడి ఫిర్యాదు దారుడిని, మరియు మద్దిలేటి ని ఎలాగైనా కేసులో ఇరికించాలని కేసులో ముద్దాయిలు అందరితో పాటు బొల్లవరం స్వాములు మరియు దబ్బల వెంకట స్వామి లతో కలిసి అల్లరి మధు మరియు మద్దిలేటి లపై నాటు బాంబుల కేసు పెట్టాలని కుట్రపన్నారని విచారణలో ముద్దాయిలు ఒప్పుకున్నారన్నారు. వారి కుట్రలో భాగముగా దబ్బల వెంకట స్వామి మరియు బోయ చిన్న దంతాలు ద్వారా 31 నాటు బాంబులను రూ.20 వేలకు నాటుబాంబులు తయారు చేయించినారు. ఆ డబ్బులు పెద్ద రంగస్వామి అతని తమ్ముడు చిన్న రంగస్వామి లు ఇచ్చినట్లు ఒప్పుకున్నారని తరువాత వారం రోజులకు దంతాలు, దబ్బల వెంకట స్వామి లు 31 బాంబులు తయారు చేసికొని వచ్చి ఆర్ ఎం పి డాక్టర్ కరీం, తన చేతితో అల్లరి మధు, మద్దిలేటి ల పేర్లు, ఫోన్ నెంబర్లు, చీటిలు వ్రాసి వారు కొనుగోలు చేసినట్లుగా డబ్బులు కూడా వ్రాసి కవర్లలో పెట్టారని, అలాగే పెద్ద రంగస్వామి పెద్ద రంగడు , చిన్న రంగస్వామి లకు ఇవ్వగా వారు 22 బాంబులను అల్లరి మధు ఇంటి బాత్ రూము పై గల నీళ్ళ ట్యాంకులో ఉంచారన్నారు. కొన్ని రోజులకు మధు ట్యాంక్ లో ఉన్న నీటితో పిల్లలకు స్నానం చేయిస్తుండగా దద్దుర్లు రావడంతో ట్యాంక్ శుభ్రం చేసేందుకు వెళ్లగా ట్యాంక్ లో నాటు బాంబుల మూటే కనిపించిందని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు వివరించారు. వెంటనే ఈ విషయంపై నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పి ఏ .శ్రీనివాసరావు పర్యవేక్షణలో నందికొట్కూర్ రూరల్ సీఐ విజయభాస్కర్ ఆధ్వర్యంలో పై కేసుకు సంబంధించి పూర్తి విచారణ చేసి కేసులో ముడ్డాయిలను గురువారం అరెస్ట్ చేశామన్నారు. ముద్దాయిలు నందికొట్కూరు పట్టణం బయట నందికొట్కూరు నుండి కర్నూల్ వెల్లు జాతీయ రహదారి పక్కన అరబిక్ మదరసా సమీపం లో నందికొట్కూరు రూరల్ సి ఐ విజయ భాస్కర్ తన సిబ్బందితో కలిసి ఏడు మంది ముద్దాయిలను ఆశన్నగారి పెద్ద రంగస్వామి బోయ పేట, కొత్త ముచ్చుమర్రి .
ఆశన్నాగారి చిన్న రంగస్వామి కొత్త మచ్చుమర్రి గ్రామము ,షేక్ కరీం బాష , బోయ చిన్న దంతాలు,
పఠాన్ బషీర్ ఖాన్ మల్యాల గ్రామము, నందికోట్కూరు మండలం, కాటం చిన్న నాగన్న కొత్త ముచ్చుమర్రి , వందనం వెంకట రమణ పాత ముచుమర్రి అరెస్టు చేసి రిమాండ్ కు పంపించమన్నారు. అంతే కాకుండా కేసులో పరారీలో ఉన్న ఇద్దరు ముద్దాయిలు దబ్బల వెంకట స్వామి మరియు బొల్లవరం స్వాములును త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. గ్రామాల్లో పాత కక్షలు పెట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటీ వారినైన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మిడుతూరు ఎస్ ఐ జగన్ మోహన్, ముచ్చుమర్రి ఎస్ ఐ నాగార్జున లు పాల్గొన్నారు.