PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎర్రచందనం కేసులో… ముద్దాయి అరెస్ట్

1 min read

పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: రుద్రవరం రేంజ్ పరిధిలోని డి వనిపెంట సెక్షన్లో పట్టుబడిన ఎర్రచందనం కేసులో పడారిలో ఉన్న ముద్దాయిని అరెస్టు చేసినట్లు రేంజ్ అధికారి శ్రీపతినాయుడు శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఈఏడాది 5వ నెల 21 తేదీన రేంజి పరిధిలోని డి వనిపెంట సెక్షన్ ప్రాంతంలో అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామానికి చెందిన పెద్దరాజు అనే వ్యక్తిని అరెస్టు చేసి ఆళ్లగడ్డ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరపరచగా నిందితున్ని రిమాండ్ కు తరలించారన్నారు.

About Author