PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెరువు కబ్జా నిందితులను అరెస్ట్ చేయాలి అఖిల పక్షాల ధర్నా

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ చెరువు కడగొమ్ము తూము స్థల కబ్జాకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ,సోమవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్థానిక నాలుగు స్తంభాల కూడలిలో రైతులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. రైతులు ధర్నా కార్యక్రమం చేపట్టడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దాదాపు గంటపాటు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్ష రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ పి రామచంద్రయ్య, సింగం శ్రీనివాాసులు మాట్లాడుతూ, శ్రీకృష్ణదేవరాయలు కాలం నాడు నిర్మించిన పత్తికొండ చెరువు పూర్తిగా కబ్జాకు గురైందనిిి అన్నారు. పత్తికొండ మండలంలోని చాలాాా గ్రామాలకు తాగునీరుు అందించే పురాతనమైన చెరువు అధికార పార్టీ నాయకులకుల కబ్జా కోరల్లో చిక్కుకుందన్నారు. చాలా గ్రామాలకు త్రాగు, సాగునీరుకు భూగర్భ జలాలు పెరిగేందుకు ఉపయోగపడే చెరువు అన్నారు. వైసిపి పార్టీకి చెందిన పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గత నాలుగు సంవత్సరాలుగా చెరువులు నింపుతామని చెబుతున్నారు కానీ నింపిందే లేదు కానీ వైసీపీ వాళ్ళ పార్టీ నాయకులు చెరువును కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారనిి తెలిపాారు. అధికార పార్టీకి చెందిన సాబ్దిన్ నూర్ భాషా లాంటి వ్యక్తులు గద్దలు వాలినట్టు వాలి చెరువులుు, కుంటలు కబ్జా చేస్తున్నారని వాపోయారుు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సినఅధికారులు అధికార పార్టీవైసిపికి కొమ్ముముకాస్తున్నారని విమర్శించారు. అధికారులు అధికార పార్టీకి ఊడిగంం చేస్తూ కబ్జాకు సహకరించడం ఎంతవరకుు సమంజసంంఅనిి అన్నారు. చెరువుకు సంబంధించి సాబ్దిన్ నూర్ భాషా చెరువు తూములను, కడుగొమ్ములను కబ్జా చేసి ఆరు అడుగుల మేర మట్టి వేసి పూడ్చి వేశారని తెలిపారు. ఇతడు ఆక్రమణలు చేసి కబ్జా చేస్తూ అధికారుల ద్వారా పట్టాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. ఇతనిపై చర్యలు తీసుకోకపోతే అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రజలు రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అధికారులను హెచ్చరించారు. ఇప్పటికైనా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్పందించి చెరువును కబ్జా చేసిన సాబ్దిన్ నూర్ భాషా పై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారుల సహాయంతో చెరువును కబ్జా చేసి రాత్రికి రాత్రి తుములను కడుగోమ్మలను పూడ్చి వేస్తుంటే, అధికారులు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. అనంతరం ఆర్డిఓ మోహన్ దాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో టిడిిపి నాయకులు అశోక్ కుమార్, రామ నాయుడు బత్తిన వెంకట రాముడు మీరాా హుస్సేన్, రంగస్వామి, సిపిఐ నాయకులు రాజా సాహెబ్, కారన్న సిపిఎం నాయకులు రంగారెడ్డిడి, దస్తగిరిి, గోపాలు, బిజెపిి నాయకులు గోరంట్ల, మల్లికార్జున, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author