NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దొంగతనానికి పాల్పడిన ముద్దాయిలు అరెస్టు

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం: ఈ నెల ఒకటవ తేదీన బధినేహాల్ గ్రామానికి చెందిన శేఖమ్మ ఇంట్లో మధ్యాహ్నం తోటకి వెళ్లిన తర్వాత ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం జరిగింది. అని ఇచ్చిన ఫిర్యాది మేరకు, దర్యాప్తు చేసి దొంగలించిన బాధినేహాల్ గ్రామానికి చెందిన ఏరిగేరి రామాదాస్ వయస్సు 27, s/o మేలి ఈరన్న అను వ్వక్తి ని ఈరోజు సిబ్బంది వీరేష్, మధు, శ్రీరాములు లతో ముద్దాయి ని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి సుమారు 45 తులాల వెండి మరియు 2 తులాల బంగారు ఆభరణాలను మరియు పదివేల రూపాయల డబ్బులను స్వాదీనం చేసుకుని రిమాండ్ కి పంపడమైనది.కౌతాళం ఎస్సై సూచన ఏమనగా గ్రామాలలో సుగ్గి/ వలసల కి వెళ్తున్నందున మీ విలువైన వస్తువులను బ్యాంక్ లో గాని బంధువుల ఇళ్లలో కానీ భద్రపరుచుకుని వెళ్లాలని మనవి.

About Author