సబ్ జైలుకు జంట హత్యల నిందితులు
1 min read
మదనపల్లి: మదనపల్లి జంటహత్యల నిందితులను సబ్ జైలుకు తరలించారు. విశాఖ మెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన.. పురుషోత్తంనాయుడు, పద్మజలను మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. పోలీసుల బందోబస్తు మధ్య వీరిని విశాఖ నుంచి మదనపల్లికి తీసుకొచ్చారు. సబ్ జైలులోకి వెళ్లే సమయంలో నిందితులు ఎలాంటి కేకలు వేయకుండా.. నిశ్శబ్దంగా వెళ్లారు. జనవరి 24న పునర్జన్మల నమ్మకంతో తమ కూతుళ్లయిన అలేఖ్య, సాయిదివ్యను ఘోరంగా హత్య చేసిన కేసులో పురుషోత్తంనాయుడు, పద్మజలు నిందితులుగా ఉన్నారు. వీరి మానసిక స్థితి సరిగాలేకపోవడంతో వీరిని విశాఖ మెంటల్ ఆస్పత్రికి తరలించారు. మానసికంగా కొంత కుదుటుపడటంతో వీరిని మదనపల్లి సబ్ జైలుకు తరలించారు.