హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార జైలు శిక్ష
1 min read
రూ.1,500/- లు జరిమాన.
ఆదోని రెండవ అదనపు జిల్లా కోర్టు తీర్పు వెలువరింపు.
గుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థ బలోపేతం.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో పెద్దకడుబూరు పోలీసులు ముద్దాయికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టారు.ముద్దాయి పెద్దకడుబూరు మండలము, గంగులపాడు గ్రామానికి చెందిన చెందిన కురువ నాగేశ్.హత్యకు గురి కాబడిన మహిళ కురువ జయలక్ష్మీ, వయస్సు.36 సం,,లు, W/o కురువ నాగేశ్, గంగులపాడు గ్రామము, పెద్దకడుబూరు మండలము.
ఇద్దరు భార్యభర్తలు.
ముద్దాయి కురువ నాగేశ్ ఏ పని చేయకుండా మద్యం త్రాగివచ్చి, తరుచూ భార్య కురువ జయలక్ష్మీని కొడుతూ ఉండేవాడు. కురువ జయలక్ష్మీ గంగులపాడు గ్రామములో క్రొత్త ఇల్లు కట్టుకుంటూ ఉండగా, ముద్దాయి నాగేశ్ ఇంటి పని చేయకుండా, మద్యము త్రాగి వచ్చేవాడు.20.02.2024 వ తేదీన కురువ జయలక్ష్మీ, తన భర్త నాగేశ్ ను ఇంటి పని చెయ్యమని చెప్పినందున, నాగేశ్ కోపగించుకుని, ఇంట్లో రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత, నాగేశ్ గొడ్డలితో తన భార్య కురువ జయలక్ష్మీని నరికి హతమార్చినాడు. సదరు ఘటనకు సంబందించి కురువ జయలక్ష్మీ తండ్రి అయిన కురువ యల్లప్ప ఫిర్యాదు మేరకు Cr.No. 27/2024 U/Sec 498 (a), 302 IPC క్రింద, ASI శివరాములు కేసు నమోదు చేయగా, అప్పటి కోసిగి CI . G. ప్రసాద్ గారు దర్యాప్తు చేపట్టి సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించారు.ప్రస్తుత పెద్దకడుబూరు SI P.నిరంజన్ రెడ్డి గారు కేసుకు సంబందించిన సాక్షులను క్రమం తప్పకుండా వాయిదాలకు కోర్టులో హాజరు అయ్యేలా చూసి, ముద్దాయికి శిక్ష పడేలా చేశారు. అన్ని కోణాల్లో విచారించిన ఆదోని రెండవ అదనపు జిల్లా కోర్టు జడ్జి వారు, ముద్దాయికి యావజ్జీవ కారాగార జైలు శిక్ష మరియు రూ.1500/- లు జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు.ఈ కేసులో ముద్దాయికి శిక్ష పడేందుకు కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను, పెద్దకడుబూరు పోలీసులను, కోర్టుమానిటరింగ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు అభినందించారు.