PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆచార్య సినిమా.. కాజ‌ల్ సీన్స్ తొల‌గింపు !?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆచార్య సినిమాలో హీరోయిన్ కాజ‌ల్ సీన్స్ తొల‌గించార‌ని తెలుస్తోంది. క‌రోనతో ఆచార్య సినిమా షూటింగ్ మొద‌ట‌ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్‌ ప్రారంభం అయ్యే సమయానికి ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్‌ షూటింగ్‌లో పాల్గొనలేదు. బ్యాలెన్స్‌ పార్ట్‌ కంప్లీట్‌ చేయమని నిర్మాతలు అడిగినా కాజల్‌ నో చెప్పడంతో మేకర్స్‌ అసహనానికి లోనయ్యారని తెలుస్తుంది. దీంతో కావాలనే ట్రైలర్‌లో కాజల్‌ని చూపించలేదని తెలుస్తుంది. సినిమాలో కూడా కాజల్‌ సీన్స్‌ని తొలగించారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది తెలియాలంటే సినిమా రిలీజ్‌ అయ్యేంత వరకు వెయిట్‌ చేయాల్సిందే.

                                

About Author