కోడి వ్యర్థాలను అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు
1 min read
మినీ లారీతో వ్యక్తులు అరెస్ట్ కేసు నమోదు
చేపల చెరువులో వేస్తుండగా ఆకస్మికదాడి పట్టివేత
ఏలూరు, న్యూస్ నేడు: నూజివీడు డిఎస్పి కె వి వి ఎన్ వి ప్రసాద్ పెదవేగి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు వారి యొక్క ఆదేశాలపై పెదపాడు ఎస్ఐ కట్టా శారదా సతీష్ పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి వ్యర్ధాలు అక్రమ రవాణాపై పెదపాడు పోలీసు యంత్రాంగం జల్లెడ పడుతున్నారు.దానిలో భాగంగా సోమవారం వేకువ జామున పెదపాడు ఎస్ఐ శారదా సతీష్ కి రాబడిన సమాచారం మేరకు వడ్డీ గూడెం గ్రామములో కోడి వ్యర్థాలు కలిగి ఉన్న లారి నీ, లారీలో ఉన్న కోడి వ్యర్ధాలను చెరువులో వేయి చుండగా ఎస్ఐ సీజ్ చేసి సదరు వాహన డ్రైవర్ మరియు వాహన యజమాని, మరియు చేపల చెరువు యజమాని పై కేసును నమోదు చేసినట్లు, అదే విధంగా సదరు కోడి వ్యర్ధాలను ధ్వంసం చేయడం జరుగుతుంది అని పెదపాడు ఎస్ఐ శారద సతీష్ తెలియ చేసినారు.