SC హాస్టల్ వార్డెన్, వాచ్మెన్ పై చర్యలు తీసుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఓర్వకల్ SC హాస్టల్ వార్డెన్, వాచ్మెన్, సిబ్బంది నిర్లక్ష్యం వలనే, బేడ బుడగ జంగం విద్యార్థి తూర్పాటి సురేందర్ 7th క్లాస్ విద్యార్థి రోడ్డు పైకి రావడం యాక్సిడెంట్ గురై, ప్రాణాపాయ స్థితిలో కర్నూలు జనరల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడని, కానీ ఇప్పటివరకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఆ విద్యార్థికి మెరుగైన వైద్యం అందించడంలో అలాగే ఆ పిల్లవాడి పరామర్శించిన విధానాలు లేకపోవడం బాధ కలిగిస్తుంది. కనుక తక్షణమే వారిపై చర్యలు తీసుకొని, పిల్లల ప్రాణాలు గాలిలోకి వదలకుండా హాస్టల్ నందు చూడాలని ఆ సంఘం నేతలు తాటికొండ నారాయణ తూర్పాటి మనోహర్ కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ కి, DRO కి వినతి పత్రం సమర్పించడం జరిగినది. పై అధికారులు స్పందిస్తూ, వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారని ఆ నేతలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి అన్న తూర్పాటి వెంకటేష్, మేనమామ పత్తిరి వెంకటేష్, పాల్గొన్నారు.