PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమాలకు పాల్పడిన మండల ఏ ఓ పై చర్యలు తీసుకోవాలి

1 min read

జైభీమ్ నాయకులు డిమాండ్

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  అక్రమ వ్యాపారం చేస్తూ, నకిలీ విత్తనాలను,బయో పురుగు మందులను సరఫరా చేస్తు అక్రమాలకు పాల్పడిన మంత్రాలయం ఏవో  పై విచారణ సరిగా లేకపోవడంతో, మరొకసారి సమగ్రంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని  జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జి హనుమన్న మాదిగ, జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జి సంఘటి యోహాను మాదిగలు డిమాండ్ చేశారు. బుధవారం మంత్రాలయం    వెటర్నరీ ల్యాబ్ కార్యాలయం లో  మంత్రాలయం మండల ఏవో  పై మూడు నెలల తర్వాత విచారణ కు జిల్లా వ్యవసాయ అధికారి అరుణకుమారి చేపట్టారు. వీరికి సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ,జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ముత్తు సుమాల మాదిగలు  మాట్లాడుతూ ప్రస్తుత  మంత్రాలయం మండలం ఏవో  వ్యవసాయ అధికారిలాగా వ్యవహరించకుండా భక్షాసురి అధికారిగా వ్యవహరిస్తూ బయో పురుగుమందు కంపెనీలతో పార్ట్నర్షిప్ తీసుకొని,మాలపల్లి లో ఉన్న వైభవ్ ట్రేడర్స్ యాజమాన్యం స్వామితో  బయో పురుగు మందులను, నకిలీ విత్తనాలను కర్ణాటక, ఆంధ్రకు సరఫరా చేస్తూ అక్రమ వ్యాపారంతో లక్షల రూపాయలు దన్నుకుంటున్నాడని ఆరోపించారు. కంపెనీవాటా 50% వ్యవసాయ అధికారి వాట 50% వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయము అన్ని ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నప్పటికీ, మీరు ఎలాంటి విచారణ చేశారని ప్రశ్నించారు.  లావాదేవీలను  కూడా ఫోన్పే ద్వారా వాట్సాప్ వాయిస్ కాల్ ద్వారా పురుగుమందు కంపెనీ డీలర్లతో డబ్బులు వివరాలు లావాదేవాలు మాట్లాడుకుంటూ బయో పురుగుమందు కంపెనీకి సంబంధించిన ఉద్యోగస్తులను భయభ్రాంతులకు గురి చేసి వారి ద్వారా అధిక మొత్తం డబ్బులు వసూలు చేస్తూ పబ్బం గడుపుతున్నాడని ఆరోపించారు. మండలంలో ఒక్కొక్క డీలర్ షాపు తనిఖీ చేస్తూ గత సంవత్సరం నుండి అనేకసార్లు భయభ్రాంతులకు గురి చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ డబ్బులు ఇవ్వలేక పోతే అధికారులకు చెబుతాను బెదిరిస్తా ఇప్పటివరకు దాదాపు ఆ ఒక్క డీలర్ తో రూ 1.50 లక్షలు రూపాయలు వసూలు చేయడం జరిగిందన్నారు. నీవు ఎవరికైనా చెబుతావంటే నీ లైసెన్సు రద్దు చేస్తూ నీ మీద కేసు పెడతానని బెదిరించి ఆయనకు కావాల్సిన డబ్బులు వసూలు చేస్తుకోవడం జరిగిందని తెలిపారు.  ఇన్ని అరాచకాలు చేసి యధాచగా  మండలంలో  తిరుగుతూ ఉంటే విచారణ కూడా జాప్యం చేయడం జిల్లా వ్యవసాయ అధికారులకు సరైనది కాదని  ఇప్పటికైనా ఏవో పైన సమగ్ర విచారణ జరిపి, శాఖ పరమైన చర్యలు తీసుకొని,  సస్పెండ్ చేయకపోతే,జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, రాష్ట్ర కమిషనర్ ఆఫీసులు ముందు   రాస్తారోకాలు, ధర్నాలు ఆమరణ నిరాహారా దీక్షలు చేస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో జై భీమ్  ఎమ్మార్పీఎస్ మంత్రాలయం నియోజకవర్గ నాయకులు దేవరపాటి అనిల్ కుమార్, కందనాతి మారెన్న, జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి సురేష్ సుమాల మాదిగ,జై భీమ్ ఎమ్మార్పీఎస్ కోసిగి మండల అధ్యక్షుడు పందికోన ఈరన్న, జై భీమ్ ఎంఆర్పిఎస్ కోసిగి మండల ప్రధాన కార్యదర్శి పందికొని పరశురాం జై భీమ్ ఎమ్మార్పీఎస్ జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాల మండల అధ్యక్షులు గాడి మూడు నరసింహుల మాదిగ, జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం టౌన్ అధ్యక్షుడు బెలగల్ గోపాల్, జై భీమ్ ఎంఆర్పిఎస్ మండల ప్రధాన కార్యదర్శి గర్జీ ప్రకాష్, జై భీమ్ ఎమ్మార్పీఎస్ పెద్దకడబూర్ మండల అధ్యక్షుడు  మంచోలి ఆదాము, జై భీమ్ ఎమ్మార్పీఎస్ పెద్ద కడబూర్ మండలం ఇన్చార్జి మంచోలి రవికుమార్ మాదిగ, వివిధ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author