PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నవ్యసిందు అకాడమీ.. అధికారులపై చర్యలు తీసుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో ఉన్నటువంటి నవ్య సింధు అకాడమీ ఎంసెట్ పాలిసెట్ కోచింగ్ సెంటర్ లో కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా కోచింగ్ సెంటర్ నడుపుతున్నారని వెంటనే కోచింగ్ సెంటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ రాజశేఖర్ బాబు కు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డక్కా కుమార్ మాట్లాడుతూ వేలకు వేలు ఫీజులు దోపిడీ చేస్తున్నారన్నారు. అదేవిధంగా కోచింగ్ సెంటర్ ను రేకుల షెడ్డులో నడుపుతుండడంతో విద్యార్థులు యువకులు వేసవికాలంలో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే విద్యార్థులకు తీవ్ర వేడి కలిగి వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. నిరుద్యోగ యువకులకు మోసపూరితంగా అడ్మిషన్ చేసి కోచింగ్ ఇస్తున్నారని ఆరోపించారు . అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకే బాత్ రూమ్ ఉండడం సిగ్గుచేటన్నారు. బాత్రూంలో కూడా సరైన వసతులు లేవని కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా కోచింగ్ సెంటర్ నడుపుతున్న యాజమాన్యంపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . లేనియెడల కోచింగ్ సెంటర్ ఎదుట పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు శేషాద్రి నాయుడు అబ్దుల్లా, పాల్గొన్నారు.

About Author