PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిబంధనలు పాటించని ప్రవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

1 min read

–కనీస మౌలిక వసతులు కల్పించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న శ్రీవాణి,విజ్డమ్ స్కూల్స్ గుర్తింపు రద్దు చేయాలి:
– ఎంఈఓ కు వినతి పత్రం అందజేసిన ఐసానాయకులు రంగస్వామి,అనిల్

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా పాఠశాలను నడుపుతున్న నందికొట్కూర్ పట్టణంలోని శ్రీ వాణి స్కూల్ మరియు మండలంలోని విజ్-డమ్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక నందికొట్కూరు మండల ఎంఈఓ ఫైజున్నీసా బేగం కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐసా జిల్లా ఉపాధ్యక్షులు రంగస్వామి, అనిల్ మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణంలోని శ్రీ వాణి స్కూల్ అలాగే విజ్డమ్ స్కూళ్లలో మాలిక వసతులు కల్పించకుండా పాఠశాలలను నడుపుతున్నారని పాఠశాలలకు ఆటస్థలం లేకుండా విద్యార్దులకు సరిపడా మరుగుదొడ్లు,లేకుండా మున్సిపల్ అనుమతులు లేకున్నా పాఠశాల నిర్వహిస్తున్నారన్నారు. అదేవిధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ధనార్జనే ధ్యేయంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిట్ నెస్ లేని బస్సులను నడుపుతు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యా శాఖ అధికారులు వెంటనే స్పందించి పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము లేకపోతే విద్యా శాఖ అధికారుల కార్యాలయాలు ముట్టడిస్తామని పాఠశాల ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసా నాయకులు రాజు, మహేష్,తదితరులు పాల్గోన్నారు.

About Author