నందవరం మండలంలో ఉన్న రెయిన్బో పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/5-10.jpg?fit=550%2C277&ssl=1)
ఏం ఈ ఓ సుదర్శన్ రెడ్డి ని విధులు నుంచి తొలగించాలి
జాయింట్ కలెక్టర్ నవ్య కి వినతిపత్రం అంద చేసిన విద్యార్ధి సంఘం నాయకులు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : నందవరం మండలంలో ఇష్టానుసారంగా విద్యార్థులు ను ఆటోల్లో, వ్యాన్లో తరలిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై ముక్యంగా రెయిన్బో పాఠశాల పై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆర్పీ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది, ఆర్యూ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్లు జాయింట్ కలెక్టర్ నవ్య కి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నందవరం మండలంలో ప్రైవేట్ పాఠశాలలో సరైన అనుమతులు లేని వాహనాలు లో మరియు బయట వాహనాల లో విచ్చలవిడిగా విద్యార్థులను తరలిస్తునారు అని, ఈ విషయం పై చాలా సార్లు ఏం ఆర్ ఓ,ఏం ఈ ఓ లకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కే మద్దత్తు తెలుప్తున్నారు. ఇప్పటికి ఈరోజు వరకు కూడా విద్యార్థులను ఆటోల్లో, వ్యాన్లో తీసుకువెళ్తున్నారు అని విద్యార్థులకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే దానికి మండలం అధికారులు కారణం అవుతారు అని వారు ఆగ్రహం వ్యక్తం చేసారు. అనంతరం జే సి నవ్య సానుకూలంగా స్పందించి ప్రైవేట్ పాఠశాలపై మరియు ఏం ఈ ఓ పై కఠిన చర్యలు తీసుకుంటాం అని విద్యార్థి సంఘాలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో నాయకులు రమేష్, సూర్య తదితరులు పాల్గొన్నారు.