PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి 

1 min read

– అక్రమ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలి.                   

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: యశోద గార్డెన్ స్కూల్ పేరుతో శ్రీ చైతన్య స్కూల్ పేరు చెప్పి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు జిల్లా విద్యాధికారులకు ఫిర్యాదు చేశారు.పత్తికొండ పట్టణంలో యశోద గార్డెన్ స్కూల్ నడుపుతూ శ్రీ చైతన్య స్కూల్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని రెవిన్యూ డివిజన్ అధికారి మోహన్ దాస్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు ముని నాయుడు మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల నుంచి యశోద గార్డెన్ స్కూల్ పేరు పెట్టి శ్రీ చైతన్య స్కూల్ పేరుతో అక్రమంగా ఫీజు వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పాఠశాలలో టి సి మరియు స్టడీ సర్టిఫికెట్లు యశోద గార్డెన్ పేరుతో ఇస్తూ,  ఫీజు రిసిప్ట్ మరియు విద్యార్థులకు ఇచ్చే స్కూల్ బుక్స్ పైన శ్రీ చైతన్య పేరు పెట్టి అక్రమంగా ఫీజులు అధికంగా వసూలుకుుపాల్పడుతున్నారని ఆరోపించారు. అదేవిధంగా పాఠశాలలో సరైనటువంటి ఫ్యాకల్టీ లేదని అన్నారు. టాయిలెట్స్ మరియు ప్లే గ్రౌండ్ లేనటువంటి స్కూల్ నడుపుతూ విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేయడం ఏమిటని అన్నారు.  అనేకసార్లు విద్యార్థి సంఘాల నాయకులుగా మండల విద్యాధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ తగు చర్యలు తీసుకోలేదన్నారు. అక్రరమ ఫీజులకుు తెగబడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాధికారులు  విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.  విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు యశోద గార్డెన్ స్కూల్లో చదివిస్తున్నామా లేక శ్రీ చైతన్య స్కూల్ స్కూల్లో చదివిస్తున్నామా అని అయోమయంలో పడ్డారు అని అన్నారు. ఇటీవల మండల విద్యాశాఖ అధికారి మస్తాన్వలి గారు పాఠశాలకు వెళ్లి విద్యార్థి నాయకుల సమక్షంలో విచారణ చేశారని తెలిపారు.  పూర్తి స్థాయి విచారణ ఈనెల 12వ తేదీన జరుపుదామని చెప్పారన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి జిల్లా విద్యాధికారికి రిపోర్ట్ ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అలా జరగని పక్షంలో  టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు బీటీ పవన్, జూటూరు తిమ్మరాజు, లక్ష్మీనారాయణ, సాయి, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author