PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాంఘిక సంక్షేమ అధికారులపై చర్యలు తీసుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల వసతి గృహ ప్రహరీ గోడ పడిపోయి దాదాపు 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సంక్షేమ అధికారులు నిధులు కేటాయించి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టకుండా విద్యార్థినిలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సంక్షేమ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మహానంది సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. స్థానిక నందికొట్కూరు పట్టణంలోని ఏఎస్ఎఫ్ తాలూకా సమితి ఆధ్వర్యంలో శనివారం తహశీల్దార్  కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ రమేష్ కుమార్ కు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణంలోని కేజీ రోడ్డు పక్కన ఉన్న సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల కాలేజీ వసతి గృహ ప్రహరీ గోడ ముందు భాగం గత ఎనిమిది నెలల కిందట శిథిలావస్థకు గురైనప్పటికి అప్పటి వసతి వార్డెన్ సొంత నిధులతో తాత్కాలికంగా గోడను నిర్మించారు అయితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికీ రెండు నెలలు గెలుస్తున్న ప్రహరీ గోడ నిర్మాణానికి సంక్షేమ అధికారులు నిధులు కేటాయించి గోడ నిర్మాణం చెయ్యకపోవడం వల్ల  విద్యార్థులు కనీసం వసతి గృహ పరిసరాల్లో బయట కూర్చోవడానికి భయపడుతున్నారని ఎందుకంటే నిత్యం కేజీ రోడ్డు వెంట మందుబాబులు తిరుగుతూ ఏ అగైత్యానికి పాల్పడతరొనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వస్తే గృహంలో విద్యను అభ్యసిస్తున్నారని సంక్షేమ అధికారులు పూర్తిగా నిర్మిస్తాం వహిస్తున్నారని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అలాగే నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ అధికారులపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

About Author