‘ముత్తూట్ ఫైనాన్స్’ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలి
1 min readపల్లెవెలుగు కల్లూరు అర్బన్: తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న గాయత్రి ఎస్టేట్ లోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ మేనేజర్ మద్దిలేటిపై చర్యలు తీసుకోవాలని స్థానిక అమ్మ ఆసుపత్రి లైన్ కు చెందిన గొల్ల నాగరాజు ఆదివారం పోలీ సులను ఆశ్రయించారు. మూడవ పట్టణ పోలీసు స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాలు ముత్తూట్ ఫైనాన్స్ లో 81.02 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి బాధితుడు నాగరాజు లోన్ తీసుకున్నాడు. డబ్బులు తిరిగి చెల్లించినా మేనేజర్ బంగారం తిరిగివ్వలేదు.