ఉన్మాది కోడుకుపై చర్యలు తీసుకోవాలి..
1 min readతల్లి తండ్రి పై చేయి చేసుకున్న కొడుకు,అసభ్యకరంగా మాట్లాడి ఒక ఉన్మాది,కిరాతకుడు పై కఠిన చర్యలు తీసుకోవాలి
అభి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ విజయబాబు..
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : నవ మాసాలు మోసి కనీ పాలు ఇచ్చి పెంచిన తల్లిని, కష్టం తెలియకుండా తను చెమట కార్చి పెంచిన తండ్రిని కొట్టి కాలుతో తన్నినా కొడుకు అయినటువంటి ఒక ఉన్మాదికి భూమిపై బ్రతికే స్థానం లేదని అభి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ విజయబాబు అన్నారు, ఆస్తుల పంపకం విషయంలో తల్లిదండ్రుపై కొడుకు చేయి చేసుకొని తన్నిన సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వెలుగులో వచ్చింది, సోమవారం అభి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ విజయబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాలు ఇచ్చి పెంచిన తల్లిని, కష్టం తెలియకుండా పెంచిన తండ్రిని తన్నడం నాకు చాలా బాధాకరంగా అనిపించిందని తెలిపారు, దుర్మార్గుడు అయినటువంటి కొడుకు తల్లిదండ్రులకు లేకుంటేనే మంచిదన్నారు, దారిన పోయే వాళ్లకు కూడా సహాయం చేయాలనే జాలి హృదయం కలిగిన దేశం మనది, అటువంటి గొప్ప దేశంలో మనం జీవిస్తున్నాము, కానీ ఒక ఉన్మాది నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులపైనే కొట్టడం ఏంటి అని ప్రశ్నించారు, ఇటువంటి ఉన్మాదులను భూమిపైన ఉండనీయరాదని, వెంటనే అతనిపైన చట్టపకారం చర్యలు తీసుకోవాలని, మరొకరి ఇంట్లో తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితికి రానివ్వకుండా చేయాలని అన్నారు, అతన్ని కఠినంగా శిక్షిస్తేనే మరొకరు ఇలాంటి పరిస్థితులకు తావివరన్నారు, ప్రభుత్వం ఇలాంటి వారి పైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.