తప్పుడు రాతలు రాసిన పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : వైసీపీ ప్రభుత్వంపైన తప్పుడు రాతలు రాసిన ఒక ప్రముఖ దిన పత్రిక యాజమాన్యంపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు.గురువారం పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పైన ఆలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తూ వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మభ్య పెట్టడానికి చూస్తున్న పచ్చ మీడియా( ఒక ప్రముఖ దిన పత్రిక) పత్రికల ప్రతులను దహనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు వ్రాతలు రాసిన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ రామ సుబ్బయ్య , రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి , నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని , నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ సగినేల ఉసెనయ్య , కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన్ , దేశెట్టి సుమలత , పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ , జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు సంటిగారి దిలీప్ రాజు , నంద్యాల జిల్లా వైసిపి ఎస్సి సెల్ అధ్యక్షులు సగినేల వెంకటరమణ, కొణిదేల గ్రామ సర్పంచ్ కొంగర నవీన్ , ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి , వైసీపీ నాయకులు దామగట్ల రత్నం, తాటిపాటి అయ్యన్న, భాస్కర్, బిజినవేముల మహేష్, నెహ్రు నగర్ శ్రీనాథ్ రెడ్డి పోతులపాడు శివానందరెడ్డి, పారుమంచాల దేవ సహాయం, తమ్మడపల్లి విక్టర్ , పేరుమాళ్ళ జాన్ , పగిడ్యాల ఉదయ్ కిరణ్ రెడ్డి, ప్రాతకోట వెంకటరెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.