ఇనాం భూములను కబ్జాకు ప్రయత్నం చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి
1 min read
మంత్రాలయం, న్యూస్ నేడు : మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామంలో ఓ వ్యక్తి సర్వే నంబర్ 62 లో ఉన్న లక్ష్మమ్మ అవ్వ , శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని అతని పై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎంఆర్ పిఎస్ జిల్లా నాయకులు గుండు పోగుల నేపాల్ తహసీల్దార్ రవి కి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండల అధికారులు, గ్రామ అధికారులు అక్రమ దారుల దగ్గర ముడుపులు తీసుకొని ఫేక్ మరణ ధ్రువీకరణ పత్రాలను, ఫేక్ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్లును పెట్టి అక్రమంగా ఇనాం భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపారు. అధికారులకు ముడుపులు ఇచ్చి అక్రమంగా పనులు చేసుకొని వారి సంపాదించినా సొమ్ము లా ఎగరేసుకు పోతున్నారని, ఇలాంటి వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు. ఇలాంటి వారిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని ఇనాం భూములను కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్ పిఎస్ నాయకులు ఈమానిల్ తదితరులు పాల్గొన్నారు.