పెట్రోల్ బంక్ యజమానిపై చర్యలు తీసుకోవాలి : సీపీఎం
1 min read
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు :పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు మండిపడ్డారు.బుధవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు నుండి మిడుతూరు వెళ్లే రోడ్డు మధ్యలో హెచ్ పీ పెట్రోల్, డీజిల్ బంకును నాగేశ్వర రావు,పక్కిర్ సాహెబ్ పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్రోల్ బంకులో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకోవడం నీటి వసతి లేకపోవడం లెట్రిన్ బాత్రూంలో ఇతర సామాన్లు పెట్టి ఉంచడం ప్రజల అవసరాల కోసం నీళ్లు తాగేందుకు ట్యాంక్ లో పురుగులు మట్టి దుమ్ము దూలితో నిండి ఉంది పెట్రోల్ బంకు ప్రయాణికులకు వాహనదారులకు అసౌకర్యంగా ఉన్నది నీరు లేకపోవడం వల్ల వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు కావున వీటికి సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలతో పెట్రోల్ బంక్ యాజమాన్యం వ్యవహరిస్తున్న చూసి చూడనట్లు అధికారులు ఉండడం విచారకరమన్నారు. కావునా పెట్రోల్ బంకు యజమానిపై కేసు నమోదు చేయాలని లేనియెడల ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, శాంతన్న,ఏసన్న,మధు పాల్గొన్నారు.