ప్రభుత్వ నిబంధనలు పాటించని ట్రీనిటీ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి
1 min read– డీఈఓ రంగారెడ్డికి వినతి పత్రం అందజేసిన ఆర్వీపీఎస్ జిల్లా అధ్యక్షులు పాలకొమ్మ అశోక్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చాలీచాలని గదులలో విద్యార్థులను ఉంచుతూ గాలి వెలుతురు లేని గదులలో తరగతులు నిర్వహిస్తున్న నగరంలోని అశోక్ నగర్ కప్పల నగర్ లలో గల ట్రినిటీ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డికి వినతి పత్రం సమర్పించారు రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అశోక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో తినేటి స్కూల్ భవనం పగుళ్లిచ్చిందని ఫైర్ సేఫ్టీ లేని బిల్డింగ్ లో స్కూల్ నడుపుతున్నారని విద్యార్థులకు ఏదైనా జరగరానిది జరిగితే తీవ్ర పరిణామాలు ఏర్పడే అవకాశం ఉన్నదని స్కూల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీఈఓ రంగారెడ్డి కి విన్నవించామని ఆయన స్కూల్ ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు వసంత్ కుమార్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.