NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధ్యాయుడి పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి-ఆప్టా

1 min read

 పల్లె వెలుగు వెబ్​:వట్టి చెరువు ఉపాధ్యాయుడు రవి బాబుపై దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏ జి ఎస్ గణపతి రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్ రావు ప్రకటన లో కోరారు. ఒక సంవత్సరం లో రిటైర్డ్ అవుతున్న రవి బాబు గారి ఉద్యోగ ప్రస్థానంలో ఇంత వరకు ఎటువంటి తప్పు లేదు.ఏడవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని కి కరచాలనం చేసినందుకు ఆతని పై అడ్డు వచ్చిన మహిళా ఉపాద్యాయుల పై దాడి చేయడం నీచమైన చర్య. అటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అప్టా ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నది. రాష్ట్రంలో మరల ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఇప్పుడు ఉన్న చట్టం కంటే  కఠినమైన చట్టము తీసుకుని రావాలి ,ఉపాద్యాయుల యందు భద్రతా భావము ను పెంపొందించుటకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రిని విద్యా శాఖా మంత్రి ఆప్టా కోరుతుంది.

PVNEWS JOBS

About Author