వీఆర్ఓ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం మరియు గ్రామ రెవిన్యూ అధికారి అయిన శ్రీ.టి.వెంకటేష్ గారు, సి.బెళగల్ తహశీల్దారు కార్యాలయంలో విధుల్లో ఉండగా, టీడీపీకోడుమూరు నియోజకవర్గ యూత్ నాయకుడు సీబీ.ఆదిత్య రెడ్డి విధుల్లో ఉన్న వీఆర్ఓ పై దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవిన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర కోశాధికారి శ్రీ.ఎ.మౌళి భాషా తీవ్రంగా ఖండించారు. సి.బెళగల్ గ్రామ సర్వే.నెం.462/1B సంబంధించిన పొలంలో ఎలాంటి అర్జీ ఇవ్వకుండా ఖాతా నెం.20001901 లో ఉన్న మిగులు భూమి నాది అని, దానిని ఆన్లైన్ లో నమోదు ఎందుకు చేయవు అని వీఆర్ఓ తో అసభ్య పదజాలం తో దుర్బషాలాడి అతనిపై చెయ్యి చేసుకొని కొట్టడం మరియు కావాలనే దురుద్దేశం తో గాయపరచడం దుర్మార్గం అని,అలాగే ఇంటి స్థలాలను కూడా ఆన్లైన్ చేయమని కూడా వీఆర్ఓ పైన దౌర్జన్యం చేయడం దుర్మార్గ మైన చర్య అని ఆయన వాపోయాడు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి PGRS లాంటి వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టి రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నప్పటికీ అన్ని తెలిసిన ఒక నియోజకవర్గ యూత్ నాయకుడు దాడికి పాల్పడడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం మరియు విధులకు ఆటంకం కలగజేయడం అనేది బియన్ఎస్ సెక్షన్ 132,195 మరియు 221 ప్రకారం జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయపడిన వీఆర్ఓ స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసి, తదుపరి మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు సర్వజన వైద్య శాల నందు చేర్పించడం జరిగిందని హాస్పిటల్ యందు వారిని పరామర్శించి వారికి అసోసియేషన్ నాయకులు ధైర్యం చెప్పారు. ఎవరికైనా పొలం సమస్యలు ఉంటే వాటిని చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలని మరియు ఆ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎ.మౌళి భాషా తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.నర్సరాజు, కోశాధికారి కె.శ్రీధర్, జిల్లా కమిటీ నాయకులు ఎస్ఎండి. రఫీ మరియు బుద్ధకవి స్థానిక వీఆర్ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.