చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవు
1 min read
సీఐ కృష్ణారెడ్డి
చెన్నూరు , న్యూస్ నేడు: మండలంలోచట్ట వ్యతిరేకమైన చర్యలకు ఎవరైనా పాల్పడినట్లయితే వారిపై చర్యలు తప్పవని సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేస్తూ, మండల పరిధిలో ఎవరైనా సభలు, సమావేశాలు నిర్వహించుకునేటట్లయితే వారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా ఎవరైనా మండల వ్యాప్తంగా ఎలాంటి ర్యాలీలు చేపట్టాలన్న, సభలు, సమావేశాలు, ఉత్సవాలు నిర్వహించుకోవాలన్న ఖచ్చితంగా పోలీస్ ల అనుమతి తీసుకోవాలని తెలియజేశారు. అలాగే ఏవైనా ఫంక్షన్లు, జాతరలలో డీజే లు పెట్టుకోవాలన్నా కూడా పర్మిషన్ తప్పనిసరి అన్నారు అలా కాకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. మండల ప్రజలు వీటిని అనుసరించాలని సి,ఐ, మండల ప్రజలకు తెలియజేయడం జరిగింది.