NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు

1 min read

– వ్యవసాయ శాఖ ఏడి మురళీధర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: గ్రామీణ ప్రాంతాల రైతులకు నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ ఏడి మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాయచోటి నియోజకవర్గంలో ని పలు ప్రాంతాల్లో విత్తనదుకాణాలు మరియు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ దుకాణాల యజమానులు రైతులకుప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందజేయాలన్నారు. గడువు ముగిసిన ఎరువులు, విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా అధిక ధరలకు విక్రయించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏ ఓ దివాకర్, రైతు భరోసా కేంద్ర సహాయకుడు సయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author