నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
1 min readఎస్సై వెంకటేశ్వర్లు
పల్లెవెలుగు వెబ్, చిట్వేల్: కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మినీ కర్ఫ్యూ విధించిందని, అత్యవసర సేవలు మినహా వ్యాపారసముదాయాలు మూసి వేయాలని ఎస్ఐ వెంకటేశ్వర్లు సూచించారరు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని, ఆ తరువాత 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. కరోన నిబంధనలు పాటించాలని సూచించిన ఎస్ఐ వెంకటేశ్వర్లు… కర్ఫ్యూ సమయంలో గుంపులుగా ఉండటం, బైకులపై తిరగడం లాంటివి చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమస్యలుంటే సెల్నం. 9154553749 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు ప్రజలకు సూచించారు.