బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలి
1 min read
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్ రద్దు పై శాశ్వత పరిష్కారం తీసుకోవాలి
ఏపీ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం,రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీందర్ రాజు
పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగులకి ఇవ్వాల్సినపాత బకాయిలు డిఎ,ఐఆర్,పిఆర్సి కమిటీ పై సోమవారం నుండి జరగబోయే బడ్జెట్ సమావేశాలులో ఉద్యోగులకు ప్రయోజనాలుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల డి ఏ లకు సంబంధించి పాత బకాయిలు, సరెండర్ లీవ్స్ కి సంబంధించి బకాయిలు, ఏపీ జి ఐ ఎల్, మెచ్యూర్ బాండ్స్ కి సంబంధించి బకాయిలు సోమవారం నుండి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించి నిధులు విడుదల చేయాలనిప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు. అలాగే సిపిఎస్ ఉద్యోగులుకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోపు సిపిఎస్ ఉద్యోగుల విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు, కానీ ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు ఎనిమిది నెలలు పూర్తి అయ్యింది, కానీ ఇప్పటివరకు సిపిఎస్ పై ప్రభుత్వం నుండి మంత్రుల కమిటీ గాని, అధికారుల కమిటీ గాని, వెయ్యలేదు, సిపిఎస్ పై మీరిచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో కి రావడానికి కృషి చేసిన సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేసే లాగా ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు తో ఉద్యోగుల సమస్యలపై చర్చించి వెంటనే సిపిఎస్ ఉద్యోగులకు శాశ్వత పరిష్కారం కొరకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం.రాష్ట్ర అధ్యక్షులు.భూపతిరాజు రవీంద్ర రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.