PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయులపై అధికారుల కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

1 min read

– బి. మాధవ స్వామి, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఫ్యాప్టో చైర్మన్.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోFAPTO; ఫ్యాప్తో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ, ఎస్ఎస్సి స్పాట్ కేంద్రాల్లోనూ నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లె బాలుర ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు నంద్యాల జిల్లా ఫ్యాప్టో చైర్మన్ బి.మాధవ స్వామి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. నిరసన కార్యక్రమంలో మాధవ స్వామి మాట్లాడుతూ పాఠశాలలకు సక్రమంగా పుస్తకాలు రాకపోగా మూడు విడతలుగా దాదాపు నాలుగు నెలలు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. జగనన్న విద్యా కానుక కిట్లు లేటుగా రావడం , పిల్లలకు కొన్ని బూట్లు సరిపోకపోవడం ఇటువంటి అనేక లోపాల వల్ల విద్యార్థులు పాఠశాలకు వేసుకొని రాలేకపోవడం జరుగుతూ ఉంది. దాదాపు మూడు నాలుగు నెలలు ఆలస్యంగా పాఠ్యపుస్తకాలు రావడం వల్ల పాఠాలు అప్పట్నుంచి మొదలుపెట్టి చెప్తూ ఉన్నప్పటికీ కొన్ని పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని వారికి నెమ్మదిగా చెప్పుకుంటూ రావడం జరిగింది . అంతమాత్రాన ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం లేదని, పిల్లలు బూట్లు వేసుకోవడం లేదని ఉపాధ్యాయులపై అధికారులపై చర్య తీసుకోవడం ఎంతవరకు సబమని , దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇంటిదగ్గర పిల్లలు ఇంటి పని చేయకపోతే ఉపాధ్యాయులపై చర్య తీసుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. ఇంటి పని విద్యార్థులు చేయకపోతే బూట్లు వేసుకొని రాకపోతే, స్కూల్ డ్రెస్ వేసుకొని రాకపోతే ఉపాధ్యాయులు దండిస్తే పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై దాడులు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్ని విధాలుగా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతూ విద్యార్థులను మెరుగైన విద్యను అందించుటకు కృషి చేస్తూ ఉంటే, గోరుచుట్టు మీద రోకలి పోటు లాగా అధికారులు ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఏ అధికారి అయితే ఉపాధ్యాయులు సరిగా పనిచేయడం లేదు అని నిందిస్తున్నారో, వారు ఒక పాఠం చెప్పి విద్యార్థుల అభివృద్ధి చూపించి మార్గదర్శకంగా నిలవాలని కోరారు. ఉపాధ్యాయుల పైన అధికారుల పైన ఇలానే కక్ష సాధింపు చర్యలు చేపడితే మునుముందు అనేక నిరసన కార్యక్రమాలు చేయడానికి వెనకాడ బోమని తెలిపారు.ఈనిరసనకార్యక్రమంలోఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు శ్రీరామచంద్రమూర్తి, యాగంటప్ప, కృష్ణారెడ్డి, స్వర్ణలత, జరీనా బేగం ,రాజు నాయక్, సత్యవేదం,వరలక్ష్మి రేణుకా దేవి, బాల పుల్లయ్య, వహీద్, సిబ్బంది మొయిద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

About Author