PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించేందుకు చర్యలు..

1 min read

– వైయస్సార్ జగనన్న బడుగు వికాసం కింద ఏడు మంది ఎం ఎస్ యం ఈ పారిశ్రామికవేత్తలకు రూ 23.30 లక్షలు రాయితీ..

– జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : స్టార్టప్ ఇండియా పథకం కింద ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ  నుంచి మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సంబంధిత లబ్ధిదారులను గుర్తించి వారికి ఆయా రంగాల్లో శిక్షణ అందించాలని అందించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేశ్ ఆదేశించారు.స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ స్టార్టప్ ఇండియా పథకం కింద అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకునేందుకు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీల నుంచి మహిళా వ్యవస్థాపకులను ప్రోత్సహించేందుకు ఔత్సాహికుల లబ్ధిదారులను గుర్తించి వారికి పరిశ్రమల శాఖచే ఆయా రంగంలో శిక్షణ అందించి వారితో సమగ్రమైన డాక్యుమెంటేషన్ తయారుచేసి వాటిని సంబంధిత బ్యాంకర్లకు సమర్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ప్రతి గ్రామపంచాయతీలో యువ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు వృత్తి నైపుణ్యం తదితర అంశాలపై శిక్షణ అందించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 547 గ్రామ పంచాయతీల నుంచి 482 మంది యువతను గుర్తించడం జరిగిందన్నారు .ఇదే స్ఫూర్తితో మరింత మంది యువతను గుర్తించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంలో ఇప్పటికే చొరవ తీసుకున్న డిపిఓ ను కలెక్టర్ అభినందించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ కింద వివిధ పరిశ్రమల ఏర్పాటుకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 180 దరఖాస్తులు రాగా వాటిలో 172 ఆమోదం పొందాయని మరో అయిదు నిర్దిష్ట కాల పరిమితి పరిశీలనలో ఉన్నాయన్నారు. వైయస్సార్ జగనన్న బడుగు వికాసం కింద పెట్టుబడి రాయితీ  విద్యుత్ రాయితీ సేల్స్ టాక్స్ రాయితీ కింద రూ 23.30 లక్షల రాయితీ సొమ్మును ఏడు మంది ఎంఎస్ఎమ్మి పారిశ్రామికవేత్తలకు మంజూరు చేస్తూ సమావేశం ఆమోదించింది.ఈ సమావేశంలో పీఎంఈజీపి సంబంధించి కింద లబ్ధిదారులకు ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన బ్యాంకర్లు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎల్డీఎంను కలెక్టర్  ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం జె.నాగరాజా, డిప్యూటీ డైరెక్టర్ పి.ఏసుదాసు ,సిక్కి ప్రతినిధి నారాయణస్వామి, టిక్కీ ప్రతినిధి కే రాజేంద్ర బాబు, ఏపీ ఐ ఐసి జెడ్ కే.బాబ్జి, ఏ పి డి సి ఎల్ ఎస్ ఇ సాల్మన్ రాజు ,డిపిఓ టి .విశ్వనాథ శ్రీనివాస్, ఎల్ డి ఎం నీలాద్రి ,కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ కె.వెంకటేశ్వర్లు ,సోషల్ వెల్ఫేర్ జెడి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

About Author