PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలింగ్ స్టేషన్ లలో మౌలిక  సదుపాయాలపై చర్యలు తీసుకుంటాం..

1 min read

జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా లోని అన్ని పోలింగ్ కేంద్రాలలో  ఈ నెల 27వ తేదిలోపు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలిపారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2024, పోలింగ్ స్టేషన్ లలో మౌలిక  సదుపాయాల కల్పన, తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27 వ తేదీ లోపు అన్ని పోలింగ్ స్టేషన్ లలో ర్యాంప్, రన్నింగ్ వాటర్, పవర్ సాకెట్/ట్యూబ్‌లైట్‌లు, విద్యుత్ సరఫరా ఏర్పాట్ల తో పాటు  పోలింగ్ స్టేషన్‌ల వద్ద  ఇతర అడ్డంకులు ఏమైనా  ఉంటే తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు..అదే విధంగా వికలాంగుల కోసం వీల్ చైర్, షేడ్ తదితర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.. ఈ మేరకు నోడల్ అధికారులు, ఈ ఆర్ ఓ లకు ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్ తెలిపారు.. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పోలింగ్ స్టేషన్ లను పరిశీలించి ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకొస్తే సవరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ..ఈ నెల 9వ తేది వరకు వచ్చిన ఫార్మ్ లను  క్లియర్ చేయడం జరిగిందన్నారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి రాయల సీమ యూనివర్సిటీ లో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్స్,డిస్పాచ్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నామని, వాటిని కూడా రాజకీయ పార్టీ ప్రతినిధులకు చూపించడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాలలో (Assured Minimum Facilities) లో భాగంగా ర్యాంప్, మంచి నీటి సౌకర్యం, విద్యుత్, కరెంట్ సాకెట్, పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ఏజెంట్లను కూడా ఏ పార్టీకి సంబంధించిన వారిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్వీప్ కార్యకలాపాలలో భాగంగా ప్రజలకు ఈవిఎంల వినియోగంపై విస్తృత అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.అనంతరం రాజకీయ పార్టీ ప్రతినిధులు పలు అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.సమావేశంలో డిఆర్ఓ నాగేశ్వరరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కె.పుల్లారెడ్డి, ఎస్.రాజేష్ బాబు, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీ ఎల్.వి.ప్రసాద్, బిజెపి స్టేట్ ఎలక్షన్ సెల్ ప్రతినిధి సాయి ప్రదీప్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు.అనంతరం కలెక్టర్ తన ఛాంబర్ లో నోడల్ అధికారులు ఆర్ అండ్ బి ఎస్ ఈ నాగరాజు, టిడ్కో ఎస్ ఈ లతో సమావేశమయ్యారు.. రాయలసీమ విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లనకు సంబంధించిన లేఔట్ లను పరిశీలించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.

About Author